మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Krishna Sharanashtakam 2 – శ్రీ కృష్ణ శరణాష్టకమ్ 2


స్వామినీచింతయా చిత్తఖేదఖిన్న ముఖాంబుజః |
నిమీలన్నేత్రయుగళః శ్రీకృష్ణశ్శరణం మమ || 1 ||

మనోజభావభరితో భావయన్మనసా రతిమ్ |
మీలనవ్యాకులమనాః శ్రీకృష్ణశ్శరణం మమ || 2 ||

నిశ్శ్వాసశుష్యద్వదనో మధురాధరపల్లవః |
మురళీనాదనిరతః శ్రీకృష్ణశ్శరణం మమ || 3 ||

నికుంజమందిరాంతస్థ-స్సుమపల్లవతల్పకృత్ |
ప్రతీక్షమాణస్స్వప్రాప్తిం శ్రీకృష్ణశ్శరణం మమ || 4 ||

వియోగభావవిహస-ద్వదనాంబుజసుందరః |
ఆకర్ణయన్నళిరుతం శ్రీకృష్ణశ్శరణం మమ || 5 ||

ముంచన్నశ్రూణి విలుఠన్ గాయన్మత్త ఇవ క్వచిత్ |
నృత్యన్ రసాసక్తమనాః శ్రీకృష్ణశ్శరణం మమ || 6 ||

శయాన ఏకతస్తల్పే స్వప్నసంబంధసిద్ధయే |
ప్రబోధపశ్చాత్తప్తో యః శ్రీకృష్ణశ్శరణం మమ || 7 ||

రసాత్మరసరీతిజ్ఞో రసలీలాపరాయణః |
రసాత్మగోపీరసికః శ్రీకృష్ణశ్శరణం మమ || 8 ||

ఇతి శ్రీహతిరాయాచార్యవిరచితం శ్రీకృష్ణశరణాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.